కాంగ్రెస్-టీడీపీలకు బుద్ధి చెప్పాలి..

Tue,September 11, 2018 12:44 AM

-ద్విచక్ర వాహన ర్యాలీని విజయవంతం చేయండి..
-సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, ఇల్లందు టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరం
కామేపల్లి,సెప్టెంబర్ 10: నేడు ఇల్లందులో టీఆర్‌ఎస్ ఆధ్వర్వంలో నిర్వహించే భారీ మోటర్ సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య కోరారు. సోమవారం మండలంలోని మద్దులపల్లిలో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో సీఎం కేసీఆర్ మరలా ఇల్లందు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించటం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మంగళవారం ఇల్లందులో భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీకి కామేపల్లి మండలం నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తాను నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషిచేశానని, నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులన్నీ పురోగతిలో ఉన్నాయని అవన్నీ ఆగిపోకుండా సకాలంలో పూర్తికావాలంటే రానున్న ఎన్నికల్లో మరలా తనను ఎమ్మెల్యేగా గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలందరూ టీఆర్‌ఎస్ పార్టీ తరుపునే ఉన్నారని త్వరలో జరగనున్న ఎన్నికల్లో అనైతిక పొత్తులకు పాల్పడిన టీఆర్‌ఎస్-టీడీపీ పార్టీలకు ప్రజలే బుద్ధి చేపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంతో పాటుగా భారీ మెజారీటీ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలన్నారు.

మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమిష్టిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ ఎత్తులను చిత్తు చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాళోత్ సరిరాంనాయక్, జడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాయల ఉపేందర్, మాజీ సర్పంచ్ జర్పుల రామోజీనాయక్, మండల నాయకులు అజ్మీర రాకేష్‌నాయక్, కాంట్రాల మల్లయ్య, రాంబాబు, కాలసాని వెంకటభిక్షం, బాణోత్ నరసింహనాయక్, భద్రునాయక్, గట్టికొప్పుల నారాయణరెడ్డి, ఇమ్మడి రామనాథం, కడారి పెద్దలింగస్వామి, మెర్రిమేకల భాస్కర్, వెంకటయ్య, పగడాల దామోదర్‌రెడ్డి, సోనబోయిన సైదులు, గడబోయిన హరీష్‌యాదవ్ తదితరులున్నారు.

220
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles