పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో..


Mon,September 10, 2018 01:49 AM

ఖమ్మం, నమస్తేతెలంగాణ: కాళోజీ జయంతి వేడుకలు ఆదివారం ఖమ్మం రోటరీనగర్ ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సమాజానికి సాహిత్య రూపంలో కాళోజీ అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, నాయకులు బచ్చు విజయ్‌కుమార్, డోకుపర్తి సుబ్బారావు, ఆళ్ల వెంకట్‌రెడ్డి, రామశాస్త్రి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా కన్వీనర్ షేక్ బాజీబాబా, వాసిరెడ్డి భారతి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కొల్లు పద్మ, తన్నీరు శోభారాణి, రమాదేవి, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.
నగరపాలకసంస్థ కార్యాలయంలో..
నగరపాలకసంస్థ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ డాక్టర్ పాపాలాల్, కమిషనర్ జీ శ్రీనివాసరావు కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాహిత్య వారధి కాళోజీ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది శ్రీనివాస్, డీఈలు రంగారావు, సుబ్రహ్మణ్యం, ఏఎస్‌వో వాసుదేవరావు, ఏఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో నివాళులర్పించిన జేసీ ఆయేషా..
ఖమ్మసిటీ: కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో కాళోజీ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ ఆయేషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపేందుకు కాళోజీ తన రచనల ద్వారా ఎంతో కృషి చేశారన్నారు. అదేవిధంగా టీఎన్‌జీఓ కార్యాలయంలో, ఎన్నెస్పీ ఈఈ కార్యాలయంలో, జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి..

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...