గర్భిణులకు పౌష్ఠికాహారాన్ని అందించాలి

Sun,September 9, 2018 01:45 AM

ఖమ్మంసిటీ: ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించేందుకు అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వైద్య, స్త్రీ, శిశు అభివృద్ధి అధికారులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య స్త్రీ శిశు అభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయా శాఖలు నిర్వహిస్తున్న వివిధ పథకాల అమలు తీరును పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్.వీ. కర్ణన్ మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు, ఆషా వర్కర్లు, గర్భిణీ స్త్రీలకు సమృద్ధిగా పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్న పిల్లలు, బాలింతలలో పౌష్టికాహారం లోపాలు కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలలో గర్బిణీలు, పిల్లలకు ఎన్‌ఎచ్‌డీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో హిమోగ్లోబిన్ శాతం, రక్తహీనత పరీక్షలు నిర్వహిచాలని ఆయన సూచించారు.పిల్లలందరికీ తప్పనిసరిగా టీకాలు వేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జాతీయ పునరావాస కేంద్రాలలో పిల్లలకు తప్పనిసరిగి ఆరోగ్య పరిక్షలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలకుండా అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు నిరతంతరం పర్యవేక్షణ ఉండాలని, అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పరిశుభ్రతపై సరైన అవగాహన కల్పించాలన్నారు. అన్ని పీహెచ్‌సీల్లో ఇనిస్టిట్యూషనల్ డెలవరీలు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాలో అమలు జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అందరికి కంటి పరిక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. లెప్రసీ, ఫైలేరియా, టీబీ కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రాంతాల్లో రక్త నమూనాలను సేకరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య, పౌష్ఠికాహారం అంశాలపై ప్రతి శనివారం సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్‌రావు, స్త్రీ శిశు అభివృద్ధి శాఖ అధికారి వరలక్ష్మీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మదన్‌సింగ్, ఐసీడీఎస్ సీడీపీఓలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

160
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles