కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి..


Sun,September 9, 2018 01:45 AM

కారేపల్లి రూరల్, సెప్టెంబర్ 8 : నాలుగేళ్ళ పాలనలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ కోరారు. చీమలపాడు ప్రాంతంలో చేలల్లో పనిచేస్తున్న కూలీల వద్దకు శనివారం వెళ్ళిన మదన్‌లాల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్‌లాల్ మాట్లాడుతూ... అన్నివర్గాల ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ అద్భుతమైన ఫలితాలనిచ్చాయన్నారు. ఆసరా పథకంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలను ఆదుకున్నారని తెలిపారు. మిషన్‌కాకతీయ పథకంతో చెరువులన్నీ బాగుపడ్డాయని వాటి ఫలితాలను కూడా అన్నివర్గాల వారు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు మంచి ఫలితాలనిచ్చి రాష్ట్రంలోని అన్నివర్గాలు సంతోషంగా ఉన్నాయని చెప్పారు. వైరా నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలాఉందని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అవకాశం కల్పిస్తే శక్తి వంచనలేకుండా అభివృద్ధికి పాటుబడతానని చెప్పారు. కారు గుర్తుకు ఓటువేసి వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి వాంకుడోత్ జగన్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ హన్మకొండ రమేష్, బద్దూలాల్ తదితరులు పాల్గొన్నారు.

161
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...