సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష


Sun,September 9, 2018 01:44 AM

మధిర, నమస్తేతెలంగాణ, సెప్టెంబర్ 8 : టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ ఆశయాలు, ఆలోచనలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు పార్టీకి శ్రీరామరక్ష అని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మధిర పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ రద్దుతో ఎన్నికల శంఖారావం మోగిందన్నారు. విజయాల మీద చర్చ అవసరం లేదని, శాశ్వతంగా తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్‌యే ముఖ్యమంత్రి అని తెలిపారు. 70సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేని అనేక పనులను నాలుగు సంవత్సరాల్లో సునాయసంగా అందరినీ మెప్పించే విధంగా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా చేపట్టి దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఏకైక వ్యక్తిగా నిలిచారన్నారు. కాంగ్రెస్ సుపరిపాలన చేసి ఉంటే ఇన్ని పనులు పెండింగ్‌లో ఉండేవి కావన్నారు. ఇన్ని పథకాలు కాంగ్రెస్ నాయకుల మదిలో మెదిలాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పెన్షన్ రూ.200 ఉండగా టీఆర్‌ఎస్ రూ.1000 చేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, రక్షణ, ఇలా రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ప్రజలు ఒకటే తీర్పుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ విజయం, కమలరాజు విజయం ఖాయమన్నారు. వంద సీట్లకు పైగా టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందన్నారు.

మహదేవపురం, రాపల్లె లిఫ్ట్‌లకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని, రాయపట్నం, గంగాపురం తదితర పలు లిఫ్ట్‌లకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. అదేవిధంగా అనేక రోడ్లను నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో భట్టివిక్రమార్క నిర్లక్ష్యం వల్ల ఒక్క మధిర నియోజకవర్గంలోనే జాప్యం జరుగుతుందని, కల్యాణలక్ష్మీ చెక్కులను వెంటనే పంపిణీ చేస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్ధేశ్యంతో ఆలస్యం చేస్తున్నారని, ఈవిషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అందుకోసమే మధిర నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సౌమ్యుడు, సుపరిచితుడు, రెండుసార్లు శానససభ్యుడిగా పోటీచేసిన, శాసనమండలి సభ్యుడిగా పోటీచేసిన వ్యక్తి లింగాల కమలరాజు అని, ఆయన గెలుపు ఖాయమన్నారు. టికెట్ ఎవరికైనా ఒకరికే వస్తుందని, అందరూ బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ప్రతికార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కోరారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమలరాజు మాట్లాడుతూ కేసీఆర్ తనపై నమ్మకంతో మధిర నియోజకవర్గ టికెట్‌ను ఇచ్చి ప్రజల్లోకి పంపినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మధిర నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం వాస్తవమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో లేకుండా, అభివృద్ధి పనుల్లో పాలుపంచుకోకుండా ఉంటున్న వ్యక్తిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలోనే మధిర నియోజకవర్గ రూపు రేఖలు మారతాయని, విజ్ఞులైన ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ఉవ్విళ్లురుతున్నారని పేర్కొన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో తన విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దేవిశెట్టి రంగారావు, అరిగె శ్రీనివాసరావు, బోనకల్లు మండల కమిటీ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మందడపు తిరుమలరావు, మల్లాది వాసు, యన్నం కోటేశ్వరరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, వెలగపుడి శివరాంప్రసాద్, చావా వేణు, యర్రగుంట రమేష్, మోదుగు బాబు, కోనా ధనికుమార్, గుగులోతు కృష్ణానాయక్, ములకలపల్లి వినయ్‌కుమార్, అవ్వా విజయలక్ష్మీ, బోగ్యం ఇందిర, గూడెల్లి ఉషారాణి, చటారి రమాదేవి, రావూరి శ్రీనివాసరావు, కోనా నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.

158
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...