ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Sun,September 9, 2018 01:43 AM

ఖమ్మంసిటీ: రాబోయే సాధారణ ఎన్నికల నిర్వహణను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్‌కుమార్ కలెక్టర్లకు సూచించారు. శనివారం హైద్రాబాద్ నుంచి కలెక్టర్లతోఆయన వీడీయో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్నికలకు సంబధించిన ప్రోఫైల్‌ను అన్ని జిల్లాలో వెంటనే రూపొందించి పంపాలని ఆయన తెలిపారు. ఓటర్ల సవరణ .జాబితాను ఈ నెల 10వ తేదీన అన్ని పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మార్పు లు చేర్పులపై విచారణ జరిపి ఎలాంటి తప్పోప్పులు దొర్లకుండా ఓటర్ల జాబితాను తయారుచేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్స్, స్వీప్‌కు సం బంధించిన వాటిపై విస్త్రత ప్రజార కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రతి నియోజకర్గానికి 10 చోప్పున వీ.వీ ప్యాట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని, వాటి ద్వారా ఓటర్లలో మాక్‌పోల్ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంచాలని అన్నారు.

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు వీఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు శిక్షణా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో ఆయా ప్రాంతాలకు చెందిన పట్టణ, గ్రామ ప్రముఖుల పేర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. రిటర్నింగ్ అదికారులు ఖాళీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు. ఎన్నికలకు అవసరమైన సిబ్బందిని ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. వీవీ ప్యాట్ యంత్రాలు జిల్లా కేంద్రాలకు అందిన తరువాత వాటిని భద్రపరిచేందుకు అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లను సమకూర్చుకోవాలని ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ కర్ణన్, జాయింట్ కలెక్టర్ మసరత్‌ఖాన్ ఆయోషా, కలెక్టరేట్ పరిపాలన అధికారి మదన్‌గోపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles