స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన కలెక్టర్, సీపీ


Sun,September 9, 2018 01:43 AM

ఖమ్మంసిటీ: రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో భద్రపరిచిన ఈవీఎంలను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో స్ట్రాంగ్ రూంలను తెరిపించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం శనివారం పరిశీలించారు. స్ట్రాంగ్‌రూంలలో ఉన్న ఈవీఎంల వివరాలను జేసీ ఆయేషా మసర్రత్ ఖానం కలెక్టర్‌కు వివరించారు. రాబోయే సాధారణ ఎన్నికల నిర్వహణకు వచ్చే ఈవీఎంలు భద్రపరుచుటకు నిర్మిస్తున్న నూతన స్ట్రాంగ్ రూంలను వారు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అసంపూర్తిగా ఉన్న స్ట్రాంగ్ రూంలను సత్వరమే అన్ని సౌకర్యాలతో పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌ను ఆదేశించారు. నిర్మించే స్ట్రాంగ్ రూంలకు సీసీ కెవెరాలను అమర్చాలని తెలిపారు. కలెక్టర్, పోలీసు కమిషనర్‌లు స్ట్రాంగ్ రూముల పరిసరాలను వారు క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి మదన్‌గోపాల్, నగరపాలక సంస్థ కమిషనర్ జె. శ్రీనివాసరావు, ముఖ్య ప్రణాళిక అధికారి రాందాసు తదితరులు పాల్గొన్నారు.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...