ఎన్నారై సమాజానికి ఉత్తం క్షమాపణ చెప్పాలి

Sun,September 9, 2018 01:42 AM

-తానా మాజీ కార్యదర్శి తాతా మధు డిమాండ్
ఖమ్మం, నమస్తే తెలంగాణ : యువనేత, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాక్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తానా మాజీ కార్యదర్శి తాతా మధు డిమాండ్ చేశారు. ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచి ఎందరో విదేశాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నరని పేర్కొన్నారు. అలాంటి వారి ఉద్యోగ ధర్మాన్ని కించపరిచేలా ఉత్తమ్ మాట్లాడటం సహేతుకంగా లేదన్నారు. గతంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులను అమెరికాకు ఆహ్వానించి సన్మానం చేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఆక్రమంలో మొత్తం ఖర్చును ఎన్నారై సమాజమే భరించిందని వెల్లడించారు. ఎందరో నిరుపేదలకు ఆర్ధికంగా, మౌళిక వసతుల ఏర్పాటుకు అనునిత్యం సహాయసహకారాలు అందిస్తున్న ఎన్నారైలపై ఉత్తం చేసిన వ్యాక్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

174
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles