తుమ్మలను కలిసిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు..


Fri,September 7, 2018 12:09 AM

ఖమ్మం, నమస్తేతెలంగాణ: త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, గులాబీ దళపతి సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అందరూ కలిసి గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహానికి వెళ్లి తమకు మరోసారి అవకాశం వచ్చేలా కృషిచేసినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. అన్ని స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేసి కేసీఆర్‌కు బహుమానంగా ఇవ్వాలని సూచించారు. కలిసిన వారిలో ఖమ్మం, వైరా, మధిర, ఇల్లెందు, సత్తుపల్లి అభ్యర్థులు పువ్వాడ అజయ్‌కుమార్, మదన్‌లాల్, కోరం కనకయ్య, లింగాల కమల్‌రాజ్, డాక్టర్ పిడమర్తి రవి ఉన్నారు.

పువ్వాడ అజయ్‌ను అభినందించిన ఎంపీ పొంగులేటి..
ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పేరు ఖరారు చేసుకున్న పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. హైదరాబాద్‌లో కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో విజయఢంకా మోగించారని, ఈ దఫా కూడా ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండాను ఎగురవేస్తారని దీవించారు. అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని స్పష్టంచేశారు.

220
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...