సామాన్యుడి గోడును చాటిన జారుడుమెట్లు...

Mon,October 10, 2016 12:08 AM

-నెల నెలా వెన్నేల... ప్రదర్శనలు అభినందనీయం..
ఖమ్మం కల్చరల్, అక్టోబర్ 9 : ప్రజా సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధులు, నాయకులు తమకు, తమ బంధువర్గానికే సేవ చేసుకుంటున్నారని, సామాన్యుడి గోడును పట్టించుకోవడం లేదని జారుడుమెట్లు నాటకం ప్రతిభింబించింది. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళాసాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నెల నెలా వెన్నెల సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా ఆదివారం రాత్రి జారుడుమెట్లు నాటకాన్ని ప్రదర్శించారు.

హైద్రాబాద్‌కు చెందిన కళాంజలి కళాకారులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఎందరో త్యాగమయుల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్రపు విలువలు దిగజారుస్తున్నారని పలు పాత్రలు చాటి చెప్పాయి. నాటికలోని కనకమహాలక్ష్మి, గంగాభవానిల సంభాషణలు ఆసక్తికరంగా సాగాయి. దోపిడీ రాజకీయాలను తిప్పికొట్టాలంటే ఓటు ఆయుధాన్ని ఉపయోగించాలని నాటిక సందేశమిచ్చింది. కొల్లా రాధాకృష్ణ దర్శకత్వంలో కంచర్ల సూర్యప్రకాశ్ రచించిన ఈ నాటికలో నవీన, రజనీ శ్రీకళ, వరప్రసాద్, రాధాకృష్ణ, మణికంఠ నటులు ఆయా పాత్రలలో మెప్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రముఖ ఈఎన్‌టీ వైద్యుడు ఎంజీవీ ప్రవీణ్ మాట్లాడుతూ ఆర్స్ సంస్థ ప్రతి నెల నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు అభినందనీయమన్నారు. రంగస్థల కళా వైభవాన్ని పెంచడానికి కళాకారులను ప్రోత్సహించాలన్నారు. సభకు సంస్థ ప్రధాన కార్యదర్శి అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్ అధ్యక్షత వహించగా, ఖమ్మం కళా పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు వివి అప్పారావు, డాక్టర్ నాగబత్తిని రవి, గరికపాటి ఆంజనేయప్రసాద్, జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

157
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles