అభివృద్ధిలో అజేయుడు

Mon,September 9, 2019 12:32 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: దాదాపు రూ.1000 కోట్ల పైచిలుకు నిధులతో నగరంలో అభివృద్ధికి బాటలు వేసిన ఘనత సీఎం కేసీఆర్‌ సర్కారుకే దక్కుతుంది. మెట్రో నగరాలకు దీటుగా ఖమ్మాన్ని ఆవిష్కరించాలనే ఏకైక లక్ష్యంతో అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారు. నగరపాలకసంస్థకు ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తోంది సర్కారు.
మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..
వేసవి వచ్చిందంటే ఖమ్మానికి ఒకప్పుడు నీటి గండమే. కానీ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత ఖమ్మం మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించబోతున్నది. కేఎంసీ అమృత్‌ పథకాన్ని మిషన్‌ భగీరథ పథకానికి అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.230 కోట్లతో మెగా మంచినీటి ప్రాజెక్టును నగర ప్రజల ముందు ఆవిష్కరించారు. నగర పౌరులు ఒక్కొక్కరికీ రోజుకు 150 లీటర్ల చొప్పున వచ్చే 30 ఏండ్లపాటు సరఫరా చేసేవిధంగా పక్కా ప్రణాళికను రూపొందించిన ఘనత పువ్వాడ అజయ్‌కుమార్‌కు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుంది.
రూ.77 కోట్లతో ధంసలాపురం ఆర్వోబీ..
ధంసలాపురం రైల్వే ఓవర్‌ బ్రిడ్జీ నిర్మాణానికి సైతం టీఆర్‌ఎస్‌ సర్కారే రూ.77 కోట్లు నిధులు మంజూరు చేసింది. పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ కారణంగానే ప్రస్తుతం ఆర్‌వోబీ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నవి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రూ.20 కోట్లతో మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు.
డబుల్‌' ఇండ్లు.. గోళ్లపాడు చానెల్‌..
అర్హత కలిగిన ప్రతి నిరుపేదకూ నయా పైసా ఖర్చులేకుండా ‘డబుల్‌ బెడ్‌రూం’ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 400 ఇండ్లు మంజూరు చేయగా.. ఖమ్మానికి 7000 ఇళ్లు కేటాయించటం గమనార్హం. ఒక్కో ఇంటికి రూ.6 లక్షల చొప్పున మొత్తం రూ.250 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణ పనులను అజయ్‌కుమార్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

జిల్లాకు ఖ్యాతి ఐటీహబ్‌, లకారం..
ఖమ్మం యువత కోసం పువ్వాడ అజయ్‌కుమార్‌ ‘ఐటీ హబ్‌'ను తీసుకువచ్చారు. తన చిరకాల మిత్రుడు, యువ నేత, అప్పటి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ద్వారా నగరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీ హబ్‌ను మంజూరు చేశాయించి శంకుస్థాపన చేయించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. లకారం ట్యాంక్‌బండ్‌ కూడా ఖమ్మం పర్యాటకానికి తలమానికంగా ఉంది.
రూ.14 కోట్లతో కార్పొరేషన్‌ కార్యాలయం..
ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న మున్సిపల్‌ కార్యాలయం ప్రస్తుత అవసరాలకు సరిపోవడంలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక కృషితో ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంపులో రూ.14 కోట్లతో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన కార్యాలయాన్ని నిర్మించతలపెట్టారు. నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
రూ.17.05 కోట్లతో బస్టాండ్‌ నిర్మాణం..
ఖమ్మంలో ఇప్పుడున్న బస్టాండ్‌ కూడా ప్రస్తుత రద్దీకి సరిపోకపోవడంతో నూతన బస్టాండ్‌ నిర్మించేందుకు అజయ్‌కుమార్‌ నాంది పలికారు. ఎన్నెస్పీ క్యాంపులో రూ.17.05 కోట్లతో నూతన బస్టాండ్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు.
రూ.10 కోట్లతో క్యాంపు కార్యాలయం
నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను అ నియోజకవర్గ ఎమ్మెల్యేకు చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు ఆయన ఇంటికి వెళ్లే సంప్రదాయం ఉండేది. అలాంటిది ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్లతో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో క్యాంపు కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేసింది. ఖమ్మంలోని వీడీఓస్‌ కాలనీలో రూ.10 కోట్లతో ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు.

200
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles