భద్రాద్రి వద్ద గోదారి ఉధృతి

Sun,September 8, 2019 02:43 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ సెప్టెంబర్7: భద్రాద్రి వద్ద గోదావరి ఉరకలు పెడుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఏజెన్సీలో గోదావరి ఉధృతి పెరిగింది. భద్రాచలం పట్టణం వద్ద శనివారం ఉదయం 6గంటలకు 39.1 అడుగు వద్ద ఉన్న గోదావరి అది క్రమేపీ శరవేగంగా పెరుగుతూ వచ్చింది. 8గంటలకు 39.8 అడుగులు, 10గంటలకు 40.5, మధ్యాహ్నం 12గంటలకు 41.1 అడుగులు, 1గంటకు 41.3, 2గంటలకు 41.5, 3గంటలకు 41.6, 4గంటలకు 41.9, 5గంటలకు 42 అడుగులకు చేరుకుంది. తిరిగి 7గంటల సమయానికి 42.3 అడుగులు దాటి ప్రవహిస్తోంది. శనివారం అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు వరద చేరుకుంటుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో భద్రాచలం కరకట్ట స్నానఘట్టాలు పూర్తిగా నీటమునిగాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్
భద్రాచలం వద్ద గోదావరి వరద పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి ఉన్నందున జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని, పశువులను విడిచిపెట్టకుండా జాగ్రత్త చేయాలని కోరారు. మండల స్థాయి, సెక్టోరియల్ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు.

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles