రేపు సీఎం ఓఎస్‌డీ దేశపతి రాక..

Fri,September 6, 2019 11:58 PM

ఖమ్మం కల్చరల్ : అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ (ఆర్క్స్) ఆధ్వర్యంలో ఈనెల 8న నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నెల నెలా.. వెన్నెల సాంస్కృతిక కదంబం నిర్వహించబడుతుందని ఆర్క్స్ నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్‌రావులు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 50వ నెల నెల కార్యక్రమానికి సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ హాజరవుతారని తెలిపారు. ఆత్మీయ అతిథులుగా రోటరీక్లబ్ స్తంభాద్రి చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, కవి యాకూబ్‌లు రానున్నారని తెలిపారు. వైరా కళాకారుల ఆధ్వర్యంలో అనుబంధం నాటిక ప్రదర్శింపబడుతుందని, సాంస్కృతిక సారథుల ఆధ్వర్యంలో ధూంధాం నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రముఖ రంగస్థల సీనియర్ నటుడు పాకాలపాటి రోశయ్యకు అభినందన సత్కారం ఉంటుందన్నారు. అధిక సంఖ్యలో కళాకారులు,కళాభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

161
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles