గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి కృషిచేస్తా

Fri,September 6, 2019 11:58 PM

-ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్
రఘునాథపాలెం : ఖమ్మం జిల్లాలోని మేకలు, గొర్రెల పెంపకం దారుల అభివృద్ధికి అవసరమైన తోడ్పాటును అందిస్తానని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గొర్రెల మార్కెట్ యార్డు నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ అధ్యక్షుడు మేకల మల్లిబాబు యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు కూరాకుల నాగభూషణం యాదవ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నం మల్లేష్‌ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా యాదవ, కురుమలకు సంబంధించిన పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు ఎమ్మెల్యేకు అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన మార్కెట్ యార్డు నిర్మాణానికి స్థలం కేటాయింపునకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. కార్పోరేటర్ పగడాల నాగరాజు యాదవ్, ఆయా సంఘం బాధ్యులు అల్లిక వెంకటేశ్వర్లు, గూదె భద్రయ్య, మల్లేబోయిన శ్రీనివాస్, మేకల మల్లిబాబు, ఆవుల వలరాజు, పల్లెబోయిన చంద్రం, లక్కి కృష్ణారావు, మీగడ శ్రీనివాస్, టీవి రమణ, సింగాల బిక్షం, బొమ్మిడి శ్రీనివాస్, గంగరాజు, సాంబయ్య ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.

160
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles