జియోట్యాగింగ్‌తో గణేష్ మండపాలకు భద్రత

Fri,September 6, 2019 11:58 PM

ఖమ్మం క్రైం, సెప్టెంబర్ 6 : ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా పనిచేస్తున్నామని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. జిల్లాలో విగ్రహాల ఏర్పాటుకు అవసరమైన పోలీస్ అనుమతులకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండా తొలిసారిగా ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న గణేష్ నిర్వహాకుల విగ్రహాల ఏర్పాటు కోసం స్థానిక పోలీసులు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాలతో పాటు పరిసర ప్రాంతాల్లోను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో గణేష్ మండపాలకు పోలీస్ భద్రత కల్పించడం జరిగిందన్నారు. కమిషనరేట్ పరిధిలో 2018 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారని, ప్రతీ గణేష్ విగ్రహానికి గూగుల్ మ్యాప్‌లో జియోట్యాగింగ్ చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెక్టార్ల వారీగా పెట్రోలింగ్ నిర్వహించే బ్లూకోడ్స్ సిబ్బంది తమ సెక్టార్ పరిధిలోని గణేష్ నవరాత్రులు నిర్వహించే గణపతి మండపాలను క్షేత్రస్థాయిలో సందర్శించి ట్యాగ్‌ల ద్వారా సంబంధిత గణేష్ మండపాల చిత్రాలను తీసుకోవడంతో పాటు సంబంధిత నిర్వాహాకుల సమాచారాన్ని పోలీస్ అప్లికేషన్ ద్వారా జియోట్యాగింగ్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.

జియోట్యాగింగ్ ద్వారా గణపతి మండపాల ప్రాంతంలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ విగ్రహాలకు భద్రత కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఉన్నతాధికారులు టీఎస్ కాప్ అఫ్లికేషన్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు చేసేందుకు వీలుగా ఉంటుందని కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. జిల్లాలో భద్రత చర్యల్లో భాగంగా సెక్టార్ వారిగా విధులు నిర్వహించే బ్లూకోడ్స్, పెట్రోలింగ్ సిబ్బంది ప్రతి రోజు విడతల వారీగా మండపాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తూ భద్రతా విషయంలో నిర్వాహకులకు సూచనలు చేస్తూ మండపాల వారీగా జారీ చేసిన బీట్‌బుక్‌లో సెక్టార్ పోలీసు సిబ్బంది సంతకాలు చేసి సంబంధిత నిర్వాహకుల సంతకాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

164
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles