జయహో కేసీఆర్...

Fri,September 6, 2019 11:57 PM

-సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
-కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంబురాలు
ఖమ్మం కమాన్‌బజార్, సెప్టెంబర్ 6 : ఎన్‌పీడీసీఎల్‌లో సీఎం కేసీఆర్ కృషి వల్లనే నూతనంగా ఖమ్మం జిల్లాలో 318 మంది జూనియర్ లైన్‌మెన్‌ల నియామకాలు జరిగాయని విద్యుత్ కార్మిక సంఘాలైన 1104, 327 యూనిన్ల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్‌పీడీసీఎల్ ఎస్సీ కార్యాలయ ఆవరణలో నూతనంగా నియమించిన అభ్యర్థులతో పాటు కార్మిక సంఘాల నాయకులు సీఎం కేసీఆర్, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాలుస్తూ జయహో కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ డిస్కం కార్యదర్శి తక్కెళ్లపల్లి శేషగిరిరావు మాట్లాడారు.

విద్యుత్‌శాఖలో జూనియర్ లైన్‌మెన్‌ల పోస్టులు భర్తీ చేసేందుకు సంస్థ పారదర్శకంగా ఉన్న కొంత మంది సంఘాల నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి భర్తీ ప్రక్రియను నిలిపివేశారన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితోనే విద్యుత్‌శాఖలో నియామకాలు జరిగాయని ఆయన అన్నారు. జిల్లాలో 318 మంది జూనియర్ లైన్‌మెన్‌లకు ఉద్యోగాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కొత్తగా నియమించబడిన జూనియర్ లైన్‌మెన్‌లకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో 327 జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, యూనియన్ నాయకులు రవికుమార్, సురేష్, రాజశేఖర్, చిరంజీవి, నాగేశ్వరరావు, నరేష్, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు

135
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles