చింతకాని రక్షకభటుడిపై సీపీకి ఫిర్యాదు

Fri,September 6, 2019 12:54 AM

చింతకాని, సెప్టెంబర్ 5 : మండల కేంద్రంలో గల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ రక్షకభటుడిపై పలు ఆరోపణలతో కూడిన పత్రాన్ని మండలానికి చెందిన కొందరు ఖమ్మంలోని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో సీపీకి వినతి పత్రం అందించినట్లు సమాచారం. సదరు ఫిర్యాదులో పేర్కొన్న విధంగా.. మున్నేరు నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన సదరు రక్షకభటుడు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్‌ల నుంచి వసూళ్ళకు పాల్పడుతూ సహకరిస్తున్నారని ఫిర్యాదు దారుల ఆరోపణ. ఈ సందర్భంగా ఆయా ఆరోపణలపై విచారణకు సీపీ ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణలో భాగంగా ఇంటిలిజెన్స్, ఐబీ అధికారులు మండలానికి చెందిన పలువురు ప్రముఖుల నుంచి సదరు రక్షకభటుడిపై సమాచారం సేకరించినట్లు పలువురు పేర్కొన్నారు.

194
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles