టీఎస్‌-ఐపాస్‌ అమలులో జిల్లా టాప్‌

Thu,December 5, 2019 02:58 AM

-నూతన పరిశ్రమలకు అనుమతుల మంజూరులో మొదటి ర్యాంకు
-మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్‌, జీఎం

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో టీఎస్‌ ఐపాస్‌ పథకం ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. అందులో భాగంగా పరిశ్రమల స్థాపకు త్వరితగతిన అనుమతులు ఇప్పించిన సందర్భంగా రాష్ట్రంలో జిల్లాకు మొదటి ర్యాంకు వచ్చింది. ఈ మేరకు టీఎస్‌ ఐ పాస్‌ ఏర్పాటు చేసి ఐదు వసంతాలు గడిచిన సం దర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, మరో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా కలెక్టర్‌ సర్ఫరా జ్‌ అహ్మద్‌, టీఎస్‌- ఐపాస్‌ జనరల్‌ మేనేజర్‌ బీ నవీన్‌కుమార్‌ మొదటి ర్యాంకు అవార్డును అందుకున్నారు.

ప్రతి 15 రోజులకు ఒకసారి కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రగతి కమిటీ సమావేశాలు జరిపించి పరిశ్రమల స్థాపనకు సంబంధిం చి పొల్యూషన్‌, ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్లాన్‌ అప్రూవల్‌, లైసెన్స్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కం ట్రీ ప్లానింగ్‌, రెవెన్యూ నాలా కన్వర్షన్‌, పవర్‌, ఇత ర అనుమతులు త్వరితగతిన ఇప్పించారు. జిల్లా లో గత ఐదేళ్లలో 768 పరిశ్రమలను 407.549 కోట్లతో స్థాపించగా, ఈ పరిశ్రమల ద్వారా 7,163 మందికి ఉపాధి కల్పించారు. నూతన పరిశ్రమలు స్థాపించడానికి, వివిధ ప్రభుత్వ శాఖల అనుమతులు పొందడానికి సంబంధించిన టీఎస్‌ ఐపాస్‌ సింగిల్‌విండో పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రంలో జిల్లాకు మొదటి ర్యాంకు రాగా, కలెక్టర్‌ సర్ఫరాజ్‌, జనరల్‌ మేనేజర్‌కు మంత్రి కేటీఆర్‌ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేటగిరి-1లో అవార్డు అం దుకున్న కరీంనగర్‌ కలెక్టర్‌, జనరల్‌ మేనేజర్లను అభినందించారు.

టీఎస్‌- ఐపాస్‌ సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అని పేర్కొన్నారు. పారిశ్రామిక సంఘాలు, అధికారులతో సీఎం కేసీఆర్‌ ఒక రో జంతా చర్చించి ఈ విధానాన్ని రూపొందించారని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతున్నదని వివరించారు. పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తు కోసం పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసేవారనీ, తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్‌ సమస్యను అధిగమించామని పేర్కొన్నారు. కొత్త తర హా ఆలోచనలతో వచ్చే వారందరికీ రాయితీలు చె ల్లిస్తామనీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 305 కోట్ల రాయితీని అందిస్తున్నామని తెలిపారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles