పేదలకు సంజీవనిలా ఎల్‌వోసీ

Thu,December 5, 2019 02:58 AM

చొప్పదండి, నమస్తేతెలంగాణ: ప్రమాదాల బారిన పడి, అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు ఎల్‌వోసీ సంజీవనిలా ఉపయోగపడుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. చొప్పదండికి చెందిన పిట్టల నరేశ్‌కు మంజూరైన రూ. 2.50 లక్షల ఎల్‌వోసీ పత్రాన్ని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్రా పాలనలో కార్పొరేట్‌ దవాఖానల్లో చికిత్స పొంది సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకుంటే అందని ద్రాక్షలా ఉండేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే చికిత్స చేయించుకోవడానికి సైతం ఎల్‌వోసీ ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు చీకట్ల రాజశేఖర్‌, గడ్డం చుక్కారెడ్డి, నలుమాచు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యేకు ఘన సన్మానం
చొప్పదండి, నమస్తేతెలంగాణ: తెలంగాణ శాసనసభ ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను ప్రజ్ఞా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వడ్లూరి గంగరాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ అభివృద్ధి, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యుడిగా నియమించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, టీఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం చుక్కారెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, నలుమాచు రామకృష్ణ, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, లోక రాజేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌, శోభన్‌బాబు, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

గంగాధర: మండలంలోని ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన దోమకొండ అంజయ్య ఇటీవల మలేషియాలో భవనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చొరవతో స్వదేశానికి చేరుకున్నాడు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించగా శస్త్ర చికిత్స కోసం రూ. లక్ష వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన తాము ఖర్చులు భరించే స్థోమత లేకపోవడంతో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు ముద్దం నగేశ్‌ ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే రవిశంకర్‌ చికిత్సకు అవసరమైన రూ. లక్ష మంజూరు చేయించారు. మంజూరు పత్రం చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం అంజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా ఆపదలో ఉన్న తమను ఎల్వోసీతో ఆదుకున్న ఎమ్మెల్యేకు అంజయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకుడు ముద్దం నగేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles