డీవైసీ ఫిర్యాదులను పరిష్కరించాలి

Tue,November 19, 2019 03:22 AM

హౌసింగ్‌బోర్డుకాలనీ: ప్రతి సోమవారం నిర్వహించే ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌'కు వచ్చే ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జేసీ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అధికారులను ఆదేశించా రు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కి స్వయంగా హాజరు కాలేని వారు ఫోన్‌ ద్వారా డీవైసీలో సమస్యలు చెబుతారనీ, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. సమస్యల పరిష్కారంతోనే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందన్నారు.

సమస్యల ఏకరువు..
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సమస్యలను ఏకరువు పెట్టారు. మానకొండూర్‌ కు రమేశ్‌ మాట్లాడుతూ చాణక్య ప్రైవేట్‌ స్కూల్‌ ను నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన నిర్వహిస్తున్నారని తెలుపగా, తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జమ్మికుంట నుంచి మధు మాట్లాడుతూ స్వామి వివేకనందా ప్రైవేట్‌ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని చెప్పారు. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నా రు. గర్షకుర్తి నుంచి స్వాతి మాట్లాడుతూ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు రా వడం లేదని తెలుపగా, జిల్లా విద్యాధికారిచే తని ఖీ చేయించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరీంనగర్‌ నుంచి రామలు మాట్లాడుతూ రేషన్‌కార్డు మంజూరికి దరఖాస్తు చేసుకున్నానని ఇంత వరకు రాలేదని తెలుపగా, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మానకొండూర్‌ మండలం వేగురుపల్లి నుంచి స్వరూప మాట్లాడుతూ తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కోరత ఉందని, విద్యావాలీంటర్‌ను నియమించాలని కోరగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని జేసీ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఇల్లందకుంట మండలం మల్యాల నుంచి రాజేశ్వర్‌ మాట్లాడుతూ తమ గ్రామం నుంచి హైవే రో డ్డు పై గంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయగా, గుంతలు పూ డ్చాలాని ఆర్‌ ఆండ్‌ బీ అధికారులను జేసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జే వెంకటమాధవరావు, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ రాజర్షిషా, డీఆర్‌డీవో పీడీ వెంకటేశ్వర్లు, షెడ్యుల్డ్‌ కులాల జిల్లా సంక్షేమాధికారి బాలసురేందర్‌, మెప్మా పీడీ పవన్‌కుమార్‌, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి అశోక్‌కుమార్‌, మార్కెటింగ్‌ డీడీ పద్మావతి, జిల్లా వ్యవసాయ అధికారి వీ శ్రీధర్‌, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అశోక్‌కుమార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెండ్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles