‘మీ హెచ్‌ఐవీ స్థితిని తెలుసుకోండి’

Tue,November 19, 2019 03:21 AM

కరీంనగర్‌ హెల్త్‌: రాష్ట్రంలో ఈనెల 15 నుంచి 30 వరకు ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ‘ మీ హెచ్‌ఐవీ స్థితిని తెలుసుకో’ అనే వినూత్న కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సుజాత అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సోమవారం కిమ్స్‌ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకొని నిర్మూలనకు సహకరించాలన్నారు. వ్యాధి ఉన్నవారికి ఉచితంగా మం దులు ఇవ్వడంతో పాటు వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా రూ 2016 ఆసరా పెన్షన్‌ అందు తుంద న్నారు. సర్కారు ఉచిత రవాణాకు బస్సు, ట్రైన్‌ పాసులను అందజేస్తున్నదని వివరించారు. జిల్లాలోని 1, 75, 628 మందికి హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4177 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. 98,888 గర్భిణులకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 133 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రాం అధికారి సంతోష్‌, వనిత, మైత్రి ప్రాజెక్ట్‌ మేనేజర్‌ తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles