గొల్లపల్లిలో వాలీబాల్‌ టోర్నీ

Tue,November 19, 2019 03:21 AM

గొల్లపల్లి : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సీనియర్‌ వాలీబాల్‌ పురుషులు, మహిళల విభాగాల్లో టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌ను సోమవారం మండల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. పురుషుల విభాగంలో 32 జట్లు పాల్గొనగా మహిళల విభాగంలో 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. పురుషుల విభాగంలో కోరుట్ల జట్లు విజేతగా నిలవగా. కరీంనగర్‌ సిటీ హాస్పిటల్‌ జట్టు రన్నరప్‌గా, వెదిర జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. క్రీడాకారులకు ట్రోఫీతో పాటు బహుమతులు అందజేశారు. కరీంనగర్‌ జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేణు కిషన్‌రావు, కరీంనగర్‌ జిల్లా సెక్రెటరీ గిన్నె లక్ష్మణ్‌, వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గురజాల బుచ్చిరెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు సత్యం, సర్పంచ్‌ నిశాంత్‌రెడ్డి, తదితరులున్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles