గంగులపై సంజయ్ కుట్ర?

Sun,November 17, 2019 02:01 AM

-వెలుగులోకి బీజేపీ ఎంపీ, కలెక్టర్ ఫోన్ సంభాషణ
-ఎన్నికల ఖర్చు, లోపాలు, డిస్‌క్వాలిఫై పై ఇద్దరి మధ్య చర్చ
-సంచలనం రేపుతున్న ఆడియో టేప్ -సోషల్ మీడియాలో వైరల్
సీఎం దృష్టికి తీసుకెళ్లా : మంత్రి గంగుల కమలాకర్
-ప్రభుత్వానికి నివేదిస్తా : కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్!
(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన గంగుల కమలాకర్‌పై బీజేపీ ఎంపీ సంజయ్ కుట్ర పన్నినట్లు ప్రచారం జరుగుతున్నది. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన సంజయ్, ఎలాగైనా గంగుల ఎన్నికను చెల్లకుండా (డిస్ క్వాలీఫై) చేసేందుకు ప్రయత్నా లు చేసినట్లు తెలుస్తున్నది. శనివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో టేప్ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. అందులో ఎంపీ సంజయ్, జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిగినట్లుగా ఉన్న ఫోన్ సంభాష ణ సంచలనం రేపుతున్నది. ఎన్నికల్లో తాను చేసి న ఖర్చు లెక్కను ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు మంత్రి గంగుల కమలాకర్ సమర్పించగా, ఎన్నికల కమిషన్ పరిశీలించి ఆమోదించింది. అయితే అందులో లోపాలు ఉన్నాయని భావించిన అప్ప టి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్ నుంచి అడ్డదారిలో వివరాలు సేకరించడంలో భాగంగానే ఫోన్ లో సంభాషించినట్లు తెలుస్తున్నది. ఆ ఆడియో లో కలెక్టర్ కూడా సంజయ్‌కి సహకరిస్తాననే విధంగా మాట్లాడిన తీరు చర్చనీయాంశమవుతున్నది.

ఎంపీ మాటల్లో అంతరార్థం ఏమిటీ?
ఎంపీ, కలెక్టర్ మధ్య జరిగినట్లుగా వెలుగులోకి వచ్చిన ఆడియో టేప్ గంగులపై చేసిన కుట్రలకు బలం చేకూరుస్తున్నది. సర్.. సర్.. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను సార్. ఇండియాలో ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మర్చిపోను సార్ అని ఒక సారి.. సార్ నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా.. కానీ బాగుండదని కలవ లేదు అంటూ మరోసారి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో ఎంపీ బండి సంజయ్ మాట్లాడిన మాటల్లో అంతరార్థం ఏమిటనేది స్పష్టమవుతున్నది. కలెక్టర్ ఎంపీకి ఏదో మేలు చేసినట్లు, ఆ మేలుకు ఈయన కృతజ్ఞత తెలిపినట్లుగా ఆ మాటల్లో అర్థం ఘోచరిస్తున్నది. మంత్రి గంగుల కమలాకర్ సమర్పించిన ఎన్నికల వ్యయంలో లోపాలు ఎక్కడున్నాయో వెతికి ఇతనికి చెబుతానని కలెక్టర్ చెప్పడంతోనే ఎంపీ ఈ మాటలు అన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది.

ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో? మరో సారి చూసి చెబుతాననీ, వాట్సాప్ నంబర్ ఇస్తే వాట్సాప్ చేస్తానని కూడా కలెక్టర్ చెప్పడం వినిపించింది. తనకు వాట్సాప్ లేదని ఎంపీ చెబితే మల్లిఖార్జున్‌కు పంపిస్తా చూసుకోండి అని కూడా కలెక్టర్ మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్‌కు పోటీ చేసిన అభ్యర్థులతో మాట్లాడే అధికారం ఉండవచ్చు. కానీ, ఈ విధంగా ఎన్నికల రహస్యాలను ఎందు కు చర్చించినట్లని ఇపుడు చర్చ జరుగుతున్నది. మంత్రి గంగుల సమర్పించిన ఎన్నికల వ్యయాన్ని సమాచార హక్కు చట్టం కింద తీసుకునే వీలున్నది. కానీ, అందులో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చూసి చెబుతానని చెప్పడంతోనే ఎంపీకి కలెక్టర్ సహకరించినట్లుగా స్పష్టంగా తెలుస్తోందని టీఆర్‌ఎస్ నాయకులు వాదిస్తున్నారు.

మాట్లాడింది నిజమేనట!
గతేడాది డిసెంబర్ 7న ఎన్నికలు జరగా 11న ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులకు వీరి మధ్యన ఒక వ్యక్తి ఉండి మాట్లాడించినట్లు తెలుస్తున్నది. మంత్రి గంగుల ఎన్నికల వ్యయాన్ని రెండు మూడు రోజుల కింద చూశాననీ, మరో సారి చూస్తానని అందులో ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో పరిశీలించి చెబుతాననే భావన వచ్చే విధంగానే ఈ సంభాషణ జరిగింది. అయితే తాను ఎంపీ సంజయ్‌తో మాట్లాడిన మాట నిజమేననీ, అయితే 8 నిమిషాలపాటు ఫోన్‌లో సంభాషణ జరిగిందనీ, దానిని 1.30 నిమిషాలకు కుదించి సోషల్ మీడియాలో విడుదల చేశారని కలెక్టర్ చెబుతున్నట్లు తెలుస్తున్నది.

అందులో తాను అలా మాట్లాడ లేదనీ, పూర్తి వివరాలు ప్రభుత్వానికి నివేదిస్తానని చెబుతున్నట్లు తెలుస్తున్నది. మంత్రి గంగుల కమలాకర్ చెబుతున్నట్లు తనను ఎన్నికల్లో గెలవకుండా కొందరు అధికారులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కుట్రలు చేశారని చెబుతున్నారు. అంటే మంత్రి గంగుల వీరి కుట్రలను ముందే పసిగట్టినట్లు అర్థమవుతున్నది. ఈ విషయాన్ని గతంలో అనేక సార్లు తాను చెప్పాననీ, వంద ప్రశ్నలకు, అనుమానాలకు ఎంపీ సంజయ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఒక్కటే సమాధానంగా నిలుస్తుందని మంత్రి గంగుల స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి కలెక్టర్, ఎంపీల మధ్య జరిగిన ఈ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ కావడం జిల్లాలో సంచనలనంగా మారింది.

194
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles