బాధిత కుటంబ సభ్యులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాల అందజేత

Sun,November 17, 2019 01:58 AM

కరీంనగర్ హెల్త్: బాధిత కుటుంబ సభ్యులకు డీఎంహెచ్‌వో ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను అందజేశారు. చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామానికి చెందిన కుమ్మరి ఉమ 2018 ఫిబ్రవరి 3వ తేదీన కరీంనగర్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (ట్యూబెక్టమీ) చేయించుకుంది. అనంతరం అనారోగ్య కారణంతో కన్నుమూసింది. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.2 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో రాంమనోహర్‌రావు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే, ఉమ కూతురుకు డీఎంహెచ్‌వో మానవతా దృక్పథంతో పుస్తకాలు, బ్యాగు, బట్టలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏవో కే రవీందర్, పర్యవేక్షకుడు ఆర్. జగదీశ్వర్, శ్రీకాంత్, రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles