నమూనా పార్లమెంట్ సభలో 25 మంది విద్యార్థులు ఒక బృందంగా మొత్తం బృందాలు పాల్గొన్నాయి. రాష్ట్రపతి వచ్చి సభను ఉద్దేశించి మాట్లాడడం, లోకసభలో స్పీకర్గా వ్యవహరించి విద్యార్థులు ఎంతగానో ఆకట్టుకున్నారు. సభ ప్రారంభంలో జాతీయ గీతాన్ని ఆలపించారు. కేంద్రంలోని అధికార పార్టీలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు సభలో ప్రతిపక్షాలు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాగా, సభలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ విద్యారాణి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ సూర్యప్రకాశ్రావు సందర్శించారు. న్యాయ నిర్ణేతగా కరీంనగర్ డిగ్రీ కళాశాల లెక్చరర్ దేవి శ్రీహరి వ్యవహరించగా, పలువురు పరిశీలకులుగా వ్యవహరించారు. ఐక్య రాజ్యసమితి సభలో ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురిని, పార్లమెంట్ సభలో ఉత్తమ ప్రతిభచూపిన ఒక బృందాన్ని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తామని ఆర్సీ, న్యాయ నిర్ణేత శ్రీహరి తెలిపారు