ఆకట్టుకున్న మాక్ యునైటెడ్ నేషన్స్

Sun,November 17, 2019 01:57 AM

ధర్మారం: ధర్మారం మండలం నందిమేడారం గురుకులంలో శనివారం నమూనా ఐక్యరాజ్యసమితి, పార్లమెంట్ సభల నిర్వహణ ఆద్యంతం ఆకట్టుకున్నది. గురుకులాల చైర్మన్ కొప్పుల ఈశ్వర్, కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు నాణ్యమైన పాఠశాల విద్య అనే అంశంపై జరిగిన ఈ సదస్సు విద్యార్థుల్ని మైమరిపించింది. ఇక్కడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 గురుకులాల నుంచి విద్యార్థులు తరలిరాగా, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీ సభ్యురాలు పూస్కూ రు పద్మజ జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా నమూనా ఐక్య రాజ్యసమితి సభ నిర్వహించగా, 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వైస్ ప్రెసిడెంట్‌గా (మేడిపల్లి), కార్యనిర్వహణ కార్యదర్శిగా (అలుగునూరు సీఓయూ), అమెరికా రా యబారిగా (రుక్మాపూర్), బంగ్లాదేశ్ ప్రతినిధిగా (చింతకుంట), ఆఫ్రికా ప్రతినిధిగా (మానకొండూరు), కొరియా ప్రతినిధిగా (మంథని), జర్మనీ ప్రతినిధిగా (మల్లాపూర్), కెన్యా ప్రతినిధిగా (నంది మేడారం), పాకిస్థాన్ ప్రతినిధిగా (బద్దెనపల్లి), భారత దేశ ప్రతినిధిగా (చిన్నబోనాల), శ్రీలంక ప్రతినిధిగా (రామగుండం), జపాన్ ప్రతినిధిగా (గర్రెపల్లి) విద్యార్థులు వ్యవహరించారు. చర్చలు ఎంతగానో అకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానంలో మార్పులు రావాలనీ, అన్ని దేశాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనీ, అందుకు ఐక్య రాజ్యసమితి సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా సభలో తీర్మానించారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles