మత్స్యకారులకు ఉపాధే లక్ష్యం

Fri,November 15, 2019 03:17 AM

పథకాలను సద్వినియోగం చేసుకోవాలిఎమ్మెల్యే సుంకె రవిశంకర్చొ ప్పదండి కుడిచెరువులోకి చేపపిల్లలు
చొప్పదండి,నమస్తేతెలంగాణ: మత్స్యకారులకు ఉ పాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభు త్వం ముందుకుసాగుతుందని ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలోని కుడి చెరువులో గురువారం చేపలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం మత్స్య సంపద పెంపునకు సర్కారు చ ర్యలు చేపడుతుందన్నారు. మత్స్యకారుల ఆర్థికా భివృద్ధికి చేపలపెంపకం దోహదపడు తుంద న్నా రు. కుడి చెరువులో చేపల పెంపకంతో స్థానిక మ త్స్యకారులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. సమైక్య పాలనలో కులవృత్తులపై ఆధారపడి జీవించేవారిని పట్టించుకోకపోవడంతో విదేశాలకు వలస పోవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ సర్కారు కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న వారికి అండగా ఉంటూ పథకాలను అమలు చేస్తూ వా రి సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలోఎంపీపీ చిలుకరవి, మాజీ జ డ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య,మాజీ ఎంపీపీలు వెల్మ మలారెడ్డి, ఓల్లాల కృష్ణహరి, టీఆర్‌ఎస్ మం డలాధ్యక్షుడు బందారపు ఆజేయ్‌కుమార్, ముదిరాజ్ సంఘ నాయకులు మంద అంజయ్య, చీకట్ల లచ్చయ్య, ఐలయ్య, రమేశ్, మల్లేశం, టీఆర్‌ఎస్ నాయకులు గడ్డం చుక్కారెడ్డి, మంద నర్స య్య, గుర్రం హన్మంతరెడ్డి, నలుమాచు రామకృష్ణ, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాచర్ల వినయ్, లోక రాజేశ్వర్‌రెడ్డి, తోటశేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కృషితో కల్యాణలక్ష్మి మంజూరు..
గంగాధర: యేడాదిన్నరగా కల్యాణలక్ష్మి కోసం ఎదురు చూస్తున్న కుటుంబానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో చెక్కు అందింది. మండలంలోని గర్శకుర్తి గ్రామానికి చెందిన వేల్పుల వెంకటేశం శోభ దంపతుల కూతురు శైలజకు ఏప్రిల్, 2018 వివాహం చేశారు. వెంటనే కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. యేడాదిన్నర గడిచినా కల్యాణలక్ష్మి జాబితాలో తమ పేరు రాకపోవడంతో 10 రోజుల క్రితం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. దీం తో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో మాట్లాడి చెక్కు లు తర్వాగా మంజూరయ్యేల చూడాలని కోరారు. దీంతో లెక్టర్ ఆదేశాల మేరకు కదిలిన అధికార యంత్రాంగం శైలజకు కల్యాణలక్ష్మి మంజూరు చేశారు.

గురువారం చొప్పదండిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శైలజ తల్లి శోభకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. తాము కోరగానే కలెక్టర్‌తో మాట్లాడి కల్యాణలక్ష్మి కింద ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించిన ఎమ్మెల్యే రవిశంకర్‌కు వెంకటేశం దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles