అంతర్జాతీయ సమావేశంలో జిల్లా శాస్త్రవేత్త ప్రజెంటేషన్

Fri,November 15, 2019 03:15 AM

టవర్‌సర్కిల్: జిల్లాకు చెందిన వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్ హైదరాబాద్‌లో జరిగిన 19వ ఇంటర్నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ సమావేశంలో పంటల్లో వచ్చే తెగుళ్లు, తీసుకోవాల్సిన చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు జరిగిన సమావేశంలో పాల్గొన్న విజయభాస్కర్ రాష్ట్రంలోని సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఆకుపచ్చ, ఎండు తెగుళ్లు, పురుగులు, కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు ఉధృతి, తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కళ్లకుకట్టినట్లు వివరించారు. అలాగే, మక్కజొన్నలో ఎండుతెగులు లక్షణాలు, తట్టుకొనే రకాలు నివారణ గురించి వివరించారు. పలు దేశాలనుంచి సుమారు 750 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నట్లు విజయభాస్కర్ వివరించారు. ఈ సమావేశం ప్రతి నాలుగేళ్ల వ్యవధిలో ప్రపంచంలో ఎక్కడైనా జరుగవచ్చుననీ, హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తాను పాల్గొని, ప్రజెంటేషన్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles