బీజేపీకి పరాభవం తథ్యం

Wed,November 13, 2019 02:34 AM

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: ‘ బల్దియా ఎన్నికల్లో సత్తా చాటుతామని బీరాలు పలుకుతున్న బీజేపీ నేతలకు పరాభవం తప్పదు.. వారి కలలు కళ్లలు కావడం తథ్యం’ అంటూ టీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్‌ వై.సునీల్‌రావు ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పుర పోరులోనూ ప్రతి బింభిస్తాయని స్పష్టం చేశారు. ఎవరెన్ని చెప్పినా ప్రజలు అభివృద్ధికే పట్టంగడుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వం లో మున్సిపాలిటీల్లో ఎన్నో అభివృద్ధ్ది కార్యక్రమా లు చేపట్టిన విషయం ప్రజానీకానికి తెలుసన్నా రు. జిల్లాలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో ఉద్యమంలా పనులు కొనసాగుతున్నా యని చెప్పారు.

బీజేపీ సింగిల్‌ డిజిట్‌ దాటదు..
జిల్లాలో ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా బీజేపీ సింగిల్‌ డిజిట్‌ దాటే పరిస్థితి లేదన్నారు. కరీంనగర్‌లో ఆరు నెలలుగా బీజేపీ నాయకులు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవడం తప్పి తే ప్రజలకు చేసిందేంలేదని దెప్పిపొడిచారు. ఆరోపణలు ఫిర్యాదులతోనే బీజేపీ నాయకులు కాలం వెళ్లబుచ్చుతున్నారని నిప్పులు చెరిగారు.

మంత్రి గంగులతోనే నగరాభివృద్ధి..
మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. చరిత్రలో ఎప్పు డూ లేని విధంగా రూ. 100 కోట్లతో చేపట్టిన నగరంలోని ఆర్‌ అండ్‌ బీ రోడ్ల అభివృద్ధ్ది పనులు చివ రి దశకు చేరుకున్నాయన్నారు. అలాగే నగరంలోని అంతర్గత రోడ్లకు రూ. 347 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులతో సగం వర కు పూర్తి కావచ్చాయనీ. అలాగే మిగితా సగం ప నులు మూడు నెలలు పూర్తి చేసేందుకు అన్ని చర్య లు చేపడుతున్నారన్నారు. నగరంపై సంపూర్ణ అవగాహన ఉన్న గంగుల కమలాకర్‌ ఆధ్వర్యలోనే అభివృద్ధ్ది చెందుతుందని ప్రజలందరికీ తెలుసునన్నారు. నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రూ. 35 కోట్ల తో ఐటీ టవర్‌ నిర్మించార న్నారు. అలా గే రూ. 189 కోట్లతో నగరానికి తలమానికంగా కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు. రూ. 506 కోట్లతో మానేరు రివర్‌ ఫ్రంట్‌ కోసం నిధుల మంజూరు చేయించి నిర్మాణం కోసం టెండర్లు పిలిచే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఎల్‌ఎండీలో కేసీఆర్‌ ఐ లాండ్‌ నిర్మాణం కోసం మొదటి విడుతగా రూ. 5 కోట్ల నిధుల మంజూరు, స్పీడ్‌ బోట్స్‌, వాటర్‌ స్పొర్ట్స్‌ ఏర్పాటు చేయటం ఒక్క టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం, మంత్రి గంగుల కమలాకర్‌ వల్లేనే సాధ్యం అవుతుందన్నారు. బీజేపీ నాయకులు మొన్నటి హు జూర్‌నగర్‌ ఎన్నికల్లో 2500 ఓట్లు సాధించడం చూసైనా రాష్ట్రంలో వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని నిష్ఠూరమాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధ్ది చెందుతుందని నమ్ముతున్నారని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నా యకులు చంద్రమౌళి, వినోద్‌, ఉపేందర్‌, కన్నం శ్రీను, వెంకట్రావు, ప్రభాకర్‌, ప్రవీణ్‌, అనిల్‌, హామీద్‌, సత్యం, నరేందర్‌, అంజన్న, కిరణ్‌, సలీం తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles