హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: సాగులో నూతన పద్ధతులు అవలంబిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధిస్తున్న మండలంలోని సిర్సపల్లి గ్రామానికి చెందిన రైతు వంగల వెంకటరెడ్డి జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. సోమవారం గూర్గావ్లో ఇండియన్ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, వ్యవసాయరంగ నిపుణుడు పురుషోత్తం రూపాల చేతుల మీదుగా వెంకటరెడ్డి పురస్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు హుజూరాబాద్ ఏఎంసీ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ దాసరి రమణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమురారెడ్డి, రైతులు రవీందర్‌రెడ్డి, రవీందర్రావు, శ్రీకాంత్‌రావు, తదితరులు అభినందనలు తెలియజేశారు.