హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

Tue,November 12, 2019 03:31 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య అన్నారు. జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో సోమవారం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ చౌక్‌లో మారథన్ వాక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలలకు కూడ పెద్దలతో సమానంగా హక్కులున్నాయన్నారు. వాటిపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు వాక్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles