మార్కెట్‌లోకి శక్తిమాన్ హార్వెస్టర్

Tue,November 12, 2019 03:30 AM

రీంనగర్ హెల్త్ : వ్యవసాయ పరికరాలను రైతులకు అందించడంలో మన్ననలు పొందిన అతిపెద్ద శక్తిమాన్ ఇప్పుడు శక్తిమాన్ హార్వెస్టర్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. శక్తిమాన్ హార్వెస్టర్‌ను సోమవారం జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్‌రెడ్డి కరీంనగర్‌లోని బైపాస్‌రోడ్‌లోగల శ్రీసాయి ఏజెన్సీస్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో శక్తిమాన్ కంపెనీకి మార్కెట్‌లో మంచి పేరుందనీ, అదే స్ఫూర్తితో రైతులకు సేవలందించాలని సూచించారు. తెలంగాణలోనే కరీంనగర్‌లో మొదటిసారి ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ వాహనాలు వర్షాకాలంలో రైతులకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. అనంతరం తుమ్మనపల్లికి చెందిన రాజేశ్వర్‌రెడ్డి, ఆచంపల్లికి చెందిన రాంచంద్రారెడ్డికి వాహనాలను అందజేశారు. ప్రొప్రైటర్ మిర్యాల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, బురదలో వరికోసే మిషన్‌ను శక్తిమాన్ ప్రవేశపెట్టిందనీ, దీని విడి భాగాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయనీ, ప్రతి హార్వెస్టర్‌లో ఒకనెల పాటు టెక్నీషియన్ ఉంటాడనీ, యంత్రం ఏది రిపేర్ అయినా అక్కడికే మెకానిక్‌లు వస్తారన్నారు. శక్తిమాన్ రోటవేటర్లు, వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలను సరఫరా చేస్తున్నామన్నారు. తెలుగు రాష్ర్టాల్లో దాదాపుగా 45 వేల మందికి పైగా రైతులు ఈ పరికరాలను వాడుతున్నారని తెలిపారు. సేల్స్ మేనేజర్ బండి మల్లేశం, సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

114
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles