వెలమ హాస్టల్‌కు రూ.3 లక్షల విరాళం

Mon,November 11, 2019 02:02 AM

టవర్‌సర్కిల్: కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలోని పద్మనాయక వెలమ హాస్టల్‌కు కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్ కాసుగంటి మాధవరావు ఆదివారం రూ.3 లక్షల విరాళం అందజేశారు. గంగాధర మండలం ర్యాలపల్లికి చెందిన తన తాత దివంగత కాసుగంటి వెంకట నారాయణరావు స్మారకార్థం హాస్టల్‌లో బాలుర భవన నిర్మాణానికి ఈ మొత్తాన్ని వినియోగించాలని నిర్వాహకులకు సూచించారు. హాస్టల్ భవన నిర్మాణానికి విరాళం అందించడంపై పద్మనాయక సంఘ ప్రతినిధులు జువ్వాడి రంగారావు, ప్రసాద్‌రావు, మేనేని శ్రీకృష్ణారావు (కన్నయ్య)లు మాధవరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles