హౌసింగ్‌బోర్డుకాలనీ: కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తల్లి దన్నా కౌర్ ఇటీవల మృతి చెందగా, శనివారం రవీందర్‌సింగ్‌ను ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు పరామర్శించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు, శాసన మండలి విప్ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సూడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సీఎం కేసీఆర్ సోదరుని కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్రావు, పెద్దపల్లి గ్రంథాలయ కమిటీ చైర్మన్ జీ రఘువీర్‌సింగ్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్, తదితరులు రవీందర్‌సింగ్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు.