బోయినపల్లి: బోయినపల్లి మండలంలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం(మిడ్‌మానేర్) నుంచి ఎల్ఎండీకి నీటిని విడుదల చేసినట్లు జలాశయం ఈఈ అశోక్‌కుమార్ తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి ఎస్ఆర్ఆర్కు 3543 క్యూసెక్కుల ప్రవాహం వచ్చిందనీ, అక్కడి నుంచి దిగువనున్న లోయర్ మానేరు డ్యామ్‌కు(ఎల్ఎండీ) శనివారం 7086 క్యూసెక్కుల నీటిని వదలినట్లు వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా 8500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా వరద కాలువ ద్వారా మాన్వాడ ఎస్ఆర్ఆర్ జలాశయానికి మాత్రం 3543 క్యూసెక్కులు చేరిందని వివరించారు. మిగతా ప్రవాహం క్రమక్రమంగా చేరనుందని తెలిపారు. పైనుంచి వస్తున్న నీటని ఎప్పటికప్పుడు మాన్వాడ జలాశయం నుంచి రివర్స్ స్లూయిస్ ద్వారా ఎల్ఎండీకి విడుదల చేస్తున్నామని తెలిపారు.