నేటినుంచి రాష్ట్రస్థాయి జూడో పోటీలు

Sat,November 9, 2019 04:35 AM

కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా మరో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటలోని సాయి మానేరు స్కూల్‌లో ఈ నెల 9 నుంచి 10 వరకు రెండు రోజుల పాటు జరుగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్స్ జూడో పోటీలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర, జిల్లా జూడో సంఘాల ప్రతినిధులు కడారి అనంతరెడ్డి, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డిలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్స్ జూడో పోటీల్లో 19 జిల్లాల నుంచి సుమారు 305 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్, ఆఫీషియల్స్ 100 మంది పాల్గొంటారనీ, వారికి ఉచిత భోజనం, వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ శనివారం ప్రారంభిస్తారనీ, ముగింపు వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, జిల్లా జూడో సంఘం బాధ్యులు సుదర్శన్, ఎల్వీ రమణ, సిలివేరి మహేందర్, శ్రీధర్, క్రాంతి, శ్యామ్, నారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నవక్రాంత్‌రెడ్డి, మహేందర్, శ్రీకాంత్‌లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles