ముగిసిన నెట్‌బాల్ ఎంపిక పోటీలు

Sat,November 9, 2019 04:34 AM

కరీంనగర్ స్పోర్ట్స్: పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) 65వ ఉమ్మడి జిల్లా నెట్‌బాల్ ఎంపిక పోటీలు శుక్రవారం ముగిశాయి. నగరంలోని పారమిత లర్నర్స్ ఫౌండేషన్ క్రీడా మైదానంలో పారమిత పాఠశాలల డైరెక్టర్స్ ఈ వినోద్‌రావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-14, 17 విభాగాల్లో నెట్‌బాల్ పోటీలు నిర్వహించి ప్రతిభచాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి కే సమ్మయ్య, పాఠశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీకర్, వైస్ ప్రిన్సిపాల్ ఎంపీ తివారి, పీడీ, పీఈటీలు కే కృష్ణ, గిన్నె లక్ష్మణ్, సంపత్‌రావు, గోలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles