రైతుల సంక్షేమమే ధ్యేయం

Fri,November 8, 2019 01:29 AM

-కాళేశ్వరం నీళ్లతో గ్రామాలు సస్యశ్యామలం
-తెలంగాణ వచ్చాకే సమగ్రాభివృద్ధి మంత్రి గంగుల కమలాకర్
-చామనపల్లి, జూబ్లీనగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

కరీంనగర్ రూరల్: తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ సర్కారు పనిచేస్తున్నదని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ మండలం చామనపల్లి, జూబ్లీనగర్ గ్రామాల్లో మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాభివృద్ధికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా భారీగా పథకాలు అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటితో రాబోయే రోజుల్లో గ్రామాలు సస్యశ్యామలం కానున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందన్నారు. నాడు ఎక్కడ చూసినా మట్టిరోడ్లు కనిపించేవనీ, నేడు సీసీ రోడ్లతో గ్రామాలు కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల మధ్యలో ఉండే నాయకుడికి ఓటమి అనేది ఉండదన్నారు. దానికి తానే ఉదాహరణ అన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామనీ, అవసరాన్ని బట్టి మరిన్ని కొనుగోలు కేంద్రాలను పెంచుతామని పేర్కొన్నారు. రైతులు వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే ఆరబెట్టుకొని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తేమ శాతం 17 మించకుండా జాగ్రత్త పడాలన్నారు.

పరేషాన్‌లో ప్రతిపక్షాలు
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మాత్రమే పరేషాన్‌లో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయా పార్టీల నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు ఎక్కడ టెంటు కనబడితే అక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. చామనపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఐకేపీ కొనుగోలు కేంద్రానికి స్థలం మంజూరు, ఐకేపీ భవన నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు. ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలిత, సర్పంచులు బొగొండ లక్ష్మి, దుర్గ, రుద్ర భారతి, జక్కం నర్సయ్య, భూమయ్య, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కాశెట్టి శ్రీనివాస్, దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు మంద రాజమల్లు, ఏపీవో భార్గవ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, నాయకులు సుంకిశాల సంపత్‌రావు, రాజేశ్వర్‌రావు, బుర్ర తిరుపతి, చల్ల లింగారెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, కట్ల సంజీవరెడ్డి, మునిరెడ్డి, వరి భద్రయ్య, గంట శంకరయ్య, నెక్‌పాషా, పరశురాములు, కూర శ్యాంసుందర్ రెడ్డి, పబ్బతి రంగారెడ్డి, శ్రీనివాస్, అంజయ్య, ఐలయ్య, రమేశ్, పల్లవి స్వశక్తి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles