రేషన్ బియ్యం పట్టివేత

Fri,November 8, 2019 01:26 AM

శంకరపట్నం: మండలంలోని ఎరడపల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రెండు ఆటో ట్రాలీలతో సహా పట్టుకున్న 22 క్వింటాళ్ల బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన ధీరావత్ పాండు, ధీరావత్ నర్సింహలు గత కొంతకాలంగా మండలంలోని వంకాయగూడెంలో జీవిస్తున్నారు. వీరు చుట్టు పక్కల గ్రామాల్లో తిరిగి రేషన్ బియ్యం సేకరించి తరలిస్తుంటారు. గురువారం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏఎస్‌ఐ నర్సయ్య, హోంగార్డ్ రాజు వెళ్లి పట్టుకున్నారు. రెండు ఆటో ట్రాలీలతో పాటు 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాండు, నర్సింహలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles