కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో స్థానం లేదు

Thu,November 7, 2019 12:45 AM

-బడుగు, బలహీన వర్గాలకు అండగా టీఆర్‌ఎస్
-పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు పదవులు
-వృద్ధుల గౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే
-రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల
-నగరాన 200 మంది టీఆర్‌ఎస్‌లో చేరిక
-దుర్శేడ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
-ప్రైవేట్ టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు


కార్పొరేషన్, నమస్తే తెలంగాణ/కరీంనగర్ రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేకుండా పోతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. భగత్‌నగర్‌లోని బృందావన్ గార్డెన్‌లో బుధవారం కాంగ్రెస్ నాయకుడు ఏ నర్సయ్య ఆధ్వర్యంలో 200 మందికిపైగా యువకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 70 ఏళ్ల కాలంలో రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని పేర్కొన్నారు. వారి హయాంలో ప్రజల బతుకులు ఎక్కడా మారలేదన్నారు. వృద్ధులకు అరకొర పింఛన్లు మాత్రమే ఇచ్చాయన్నారు. కానీ టీఆర్‌ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక పింఛన్ పెంచిందని పేర్కొన్నారు. పింఛన్‌ను రూ. 2016కు పెంచి వృద్ధుల గౌరవాన్ని కాపాడిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌తోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఇక్కడి యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలన్న ఆలోచనతోనే ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తున్నామనీ, త్వరలోనే పరిశ్రమలను తీసుకువచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మరోసారి మోసపూరిత, దొంగ పార్టీలు వస్తాయనీ, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. టీఆర్‌ఎస్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నదని తెలిపారు.

ప్రతిపక్షాలన్నీ ఒక్కటై హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని చూశాయనీ, కానీ, ప్రజలు మాత్రం వారి మాటలు నమ్మకుండా అత్యధిక మెజార్టీతో తమ అభ్యర్థిని గెలిపించారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ పనులు చేపడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు. పార్టీలో పని చేసే వారికి తప్పకుండా పదవులు వస్తాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఎవ్వరికి టిక్కెట్లు ఇచ్చినా గెలిపించుకోవాలన్నారు. పైరవీలతో పదవులు రావనీ, అందుకు తానే నిదర్శనమని పేర్కొన్నారు. తన చివరి రక్తం బొట్టు వరకు కూడా సీఎం కేసీఆర్ కోసం పని చేస్తానని స్పష్టంచేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, జడ్పీ సభ్యురాలు శ్రీలత, నాయకులు వై.సునీల్‌రావు, నలువాల రవీందర్, బోనాల శ్రీకాంత్, వాసాల రమేశ్, ప్రకాశ్, హరిశంకర్, కలర్ సత్తన్న, పిట్టల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి గింజనూ కొంటాం..
రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ మండలంలోని దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలో ధాన్యం దిగుబడికి తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. పక్క రాష్ర్టాల నుంచి వచ్చే ధాన్యానికి ఇక్కడ అనుమతి లేదన్నారు. ప్రభుత్వానికి భారమైనప్పటికీ రూ,1,835 మద్దతు ధర చెల్లించి, ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్శేడ్ సింగిల్‌విండో చైర్మన్ మంద రాజమల్లు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలితశ్రీనివాస్, మండల వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, కాశెట్టి శ్రీనివాస్, గాజుల అంజయ్య, ఎంపీటీసీ గోలి రాజ్యలక్ష్మిసంతోష్, గోలి సమ్మయ్య, ఎల్కపల్లి స్వరూపచంద్రమోహన్, గ్రామ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, సర్పంచ్‌లు చామనపల్లి అరుణరాజయ్య, జక్కం నర్సయ్య, ఊరడి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యూత్ మండలాధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, బలుసుల శంకర్, సర్వర్‌పాషా, కోరుకంటి వేణుమాధవరావు, తోట తిరుపతి, డీ లక్ష్మయ్య, రాఘవరెడ్డి, అంజిరెడ్డి, మంద రమేశ్‌గౌడ్, గోపాల్, ఆరె శ్రీకాంత్, మహేశ్, బుర్ర రమేశ్‌గౌడ్, రాజిరెడ్డి, ఆంజనేయులు, మారం సంపత్, కొమురయ్య, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
జిల్లాలోని ప్రైవేట్‌స్కూళ్లలో పని చేస్తున్న టీచర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి స్థానిక టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి మాట్లాడుతూ, ప్రైవేట్ టీచర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, తనవంతుగా సమస్యల పరిష్కారానికి పాటుపడుతానన్నారు. న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేసినప్పుడే విజయం సాధిస్తామన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ని అమలు చేసేందుకు కృషి చేస్తాననీ, దీనిపై గురువారం ఉదయం డీఈఓతో సమావేశమవుతానని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రిని అసోసియేషన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రవీందర్, చందు, రాజేశ్, సతీశ్, మహేందర్, పాల్గొన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles