అథ్లెటిక్స్‌లో నైపుణ్యం ప్రదర్శించాలి

Thu,November 7, 2019 12:44 AM

కరీంనగర్ రూరల్: విద్యార్థులు ఆథ్లెటిక్స్ క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావాలని సూచించారు. బుధవారం దుర్శేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య మండల శాఖ అధ్వర్యంలో మండల స్థాయి అండర్ 14-17 బాల బాలికల అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ మండల కన్వీనర్ కృష్ణ, పీడీ ఆర్ శ్రీనివాస్, సౌజన్య, భువనేశ్వర్‌కుమార్ పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles