కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

Thu,November 7, 2019 12:43 AM

మానకొండూర్ రూరల్: మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన చుక్క ఎల్లమ్మ(80) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గ్రామ శివారులోని ఓ కుంటలో పడి వృద్ధురాలు మృతిచెందింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. చుక్క ఎల్లమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె కొడుకు దగ్గరలోని ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి మందులను తీసుకువచ్చి ఇచ్చాడు. తెల్లవారుజామున ఇంట్లో లేకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. పెరుమయ్యకుంట నుండి వెళ్తున్న గ్రామస్తుడు ఒకరు కుంటలో బోర్లపడిన శవం ఉందని గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు ఘట నా స్థలానికి చేరుకుని మృతదేహం వెలికితీసి చుక్క ఎల్లమ్మదిగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం కరీంనగర్ దవాఖానాకు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి కడుపునొప్పి భరించలేక కుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు, పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎల్లమ్మకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు గుంటి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles