ట్రాఫిక్ పార్కులో విద్యార్థుల సందడి..

Thu,November 7, 2019 12:42 AM

ప్రమాదాల నివారణకు తిమ్మాపూర్‌లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పార్కులో పారమిత పాఠశాల విద్యార్థులు బుధవారం సందడి చేశారు. విద్యార్థులకు రెండు విడతలుగా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. సిగ్నల్స్ వద్ద, హాస్పిటల్స్, డివైడర్లు, జీబ్రా క్రాసింగ్, పాఠశాలల వద్ద ఏ విధంగా వెళ్లాలి అనే విషయాలను వివరించారు. అలాగే, పార్కులో విద్యార్థులకు సైకిళ్లు ఇచ్చి తిప్పుతూ వివరించారు. ఆడిటోరియంలో ప్రజెంటర్ ద్వారా పలు అంశాలను ఎంవీఐ అల్లె శ్రీనివాస్, ఏఎంవీఐ ఉమర్ ఫరూక్, డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులు పిల్లలకు అవగాహన కల్పించారు.-తిమ్మాపూర్ రూరల్

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles