స్వచ్ఛ దర్పణ్‌ -3లో జిల్లా టాప్‌

Wed,November 6, 2019 01:57 AM

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ )
స్వచ్ఛ భారత్‌ అమల్లో ఇప్పటికే పలుసార్లు జాతీయ, రాష్ట్రస్థాయి ప్రశంసలు అందుకున్న కరీంనగర్‌ జిల్లా మరొక అడుగు ముందుకు వేసి స్వచ్ఛ దర్పణ్‌-3లో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. కరీంనగర్‌తోపాటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఇప్పటికే ఈ స్థానం నిలబెట్టుకున్నాయి. జగిత్యాల జిల్లా కూడా ఈ జాబితాలో చోటు సాధించేందుకు అతి చేరువలో ఉంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తోపాటు స్వచ్ఛ భాతర్‌ ఉద్యోగులను మంత్రి గంగుల కమలాకర్‌ మంగళవారం అభినందించారు. జిల్లాను మరింత సుస్థిర పారిశుధ్య జిల్లాగా మార్చేందుకు అందరూ కంకణబద్ధులు కావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. అలాగే, ఈ ర్యాంకింగ్‌తోపాటు దేశం ఓడీఎఫ్‌గా మార్చేందుకు భాగస్వామ్యం అందించిన జిల్లా ప్రజలను అభినందిస్తూ.. కేంద్రం జారీ చేసిన ధ్రువపత్రాన్ని అందుకున్న కలెక్టర్‌ను స్వచ్ఛ భారత్‌-యూనిసెఫ్‌ బృందం కలిసి అభినందనలు తెలిపింది. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో, డీఆర్డీవో, డీపీఓ, యూనిసెఫ్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ కిషన్‌స్వామి, ఎస్‌బీఎం రమేశ్‌, వేణు, యూనిసెఫ్‌ ఫెసిలిటేటర్లు కల్యాణి, అనూష, రవి, వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles