సంయమనంతో ఉండాలి

Wed,November 6, 2019 01:57 AM

కరీంనగర్‌ క్రైం : అయోధ్య వివాదంపై ఈ నెల 17లోగా సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని సీపీ కమలాసన్‌రెడ్డి కోరారు. అత్యున్నత న్యాయస్థానం అన్ని అంశాలను విచారించి తుది తీర్పు ఇవ్వబోతున్నదన్నారు. ఆ తీర్పు ఎలా ఉన్నా అందరూ గౌరవించాలన్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. మత సామరస్యానికి కరీంనగర్‌ మారుపేరుగా నిలిచిందనీ, ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు. తీర్పు నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలతో సమావేశాలు నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, సోషల్‌ మీడియాలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ఎవ్వరు రెచ్చగొట్టే సందేశాలు పెట్టినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, పటాకలు కాల్చడం, స్వీట్ల పంపిణీ, ర్యాలీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించవద్దనీ, వాటిని నిషేధిస్తున్నట్లు తెలిపారు. విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తామని సృష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, నగర ఏసీపీ అశోక్‌, సీఐలు శ్రీనివాసరావు, దేవారెడ్డి, విజ్ఞాన్‌రావు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles