సహకార భావంతో పని చేయాలి

Tue,October 22, 2019 06:08 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ : పొదుపు సంఘం సభ్యులు సహకార భావంతో పని చేయాలని వరంగల్ సహకార వికాస సంస్థ వరంగల్ మేనేజర్ కే లక్ష్మణ్ అన్నారు. సోమవారం మండలంలోని పోరండ్ల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర పురుషుల పొదుపు సహకార సమితి పోరండ్ల సాధారణ మహాసభ సమావేశం సమితి అధ్యక్షుడు కొత్త రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ సమితి పరిధిలో 16 సంఘాల్లోని 9,256 మంది సభ్యుల పొదుపు నిధులు రూ.18కోట్ల 41 లక్షలను 4142 సభ్యులకు అప్పుల రూపంలో ఇచ్చినట్లు పేర్కొన్నారు. సంఘం అందిస్తున్న సేవలను ప్రతి సభ్యుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సమితి అధ్యక్షుడు కొత్త రాజిరెడ్డి మాట్లాడుతూ సంఘాల్లో పాలకవర్గ సభ్యులు, అధ్యక్షులు, గణకులు సమన్వయంతో బాధ్యతతో పని చేయాలని సూచించారు. రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి తప్పులు, లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. సంఘాల్లో సభ్యత్వం పెంచుకుంటూ సంఘ సభ్యులు పొదుపులు, అప్పులు, బకాయిలు పడకుండా చూడాలని కోరారు. పరిపాలన సౌలభ్యం కోసం పోరండ్ల, నుస్తులాపూర్ లను సమితులుగా విభజించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సహకార వికాస అధికారి రవీందర్, సమితి ఉపాధ్యక్షులు గుడిపాటి లకా్ష్మరెడ్డి, పాలకవర్గ సభ్యులు వావిలాల అంజిరెడ్డి, ఎల్లాల రమేశ్‌రెడ్డి, గుంటి వెంకటేశ్వర్లు, కరివేద సతీశ్‌రెడ్డి, పడాల శ్రీనివాస్, కీసర తిరుపతి, ఎగోలపు శ్రీనివాస్, ఇనుకొండ మాధవరెడ్డి, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, మర్రి కుమారస్వామి, మార్క ఎల్లయ్య, పాడ్రాల కనక రాజేశం, గంగిపల్లి సంపత్, చింతం శ్రీనివాస్, సమితి గణకులు కొలిపాక సారయ్య, చింతల విజయలక్ష్మి, బొజ్జ శ్రీలత, సమితి మాజీ గణకులు బిజిగిరి మొగిలయ్య, వివిధ సంఘాల పాలకవర్గ సభ్యులు, గణకులు పాల్గొన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles