కొండూరి రవీందర్‌రావుకు ఘన సత్కారం

Tue,October 22, 2019 06:08 AM

టవర్‌సర్కిల్: అంతర్జాతీయ సహకార బ్యాంకింగ్ సమాఖ్య (ఐసీబీఏ) డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావును పాలకవర్గ సభ్యులు, జిల్లా అధికారులు సోమవారం కేడీసీసీబీలో ఘనంగా సత్కరించారు. ఆఫ్రికా ఖండంలోని రువాండా దేశ రాజధాని కిగాలిలో ఈ నెల 14 నుంచి 17వరకు జరిగిన అంతర్జాతీయ సహకార కూటమి (ఐసీఏ) జనరల్ అసెంబ్లీ అభివృద్ది సాధన కొరకు సహకార సంఘాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్, కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థపై రెండు దశాబ్దాల సుధీర్ఘ అనుభవం కలిగిన రవీందర్‌రావును ఐసీబీఏ ప్రతినిధులు డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 94 దేశాల నుంచి 1100 ప్రతినిధులు పాల్గొన్న అంతర్జాతీయ సహకార కూటమి జనరల్ అసెంబ్లీలో కొండూరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మన రాష్ర్టానికి గర్వకారణమని కేడీసీసీబీ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్. సత్యానారాయణరావు పేర్కొన్నారు. రవీందర్‌రావు మాట్లాడుతూ, సహకార సంఘ వ్యవస్థ బలోపేతం కావడం రైతాంగ అభివృద్ధ్దికి దోహదపడుతుందన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గ సభ్యులు, రాష్ట్ర సహకార బ్యాంకు అధికారులు, బ్యాంక్ డీజీఎంలు, ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles