ప్రశాంతంగా రెడ్డి సంక్షేమసంఘం ఎన్నికలు

Tue,October 22, 2019 06:07 AM

కరీంనగర్ రూరల్: రాజబహద్దూర్ వెంకటరామారెడ్డి విజ్ఞాన పరిషత్ (రెడ్డి సంక్షేమ సంఘం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంఘం ఎన్నికలు అధివారం సీతారాంపూర్‌లోని రెడ్డి కల్యాణమండపంలో ప్రశాంతంగా జరిగాయి. సంఘ సభ్యులు రెండు ప్యానల్‌లు ఏర్పాటు చేయడంతో ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా సాగాయి. 3,802 మంది ఓటర్లకుగానూ 2,470 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఒక అధ్యక్ష, మూడు ఉపాధ్యక్ష, ఒక ప్రధాన కార్యదర్శి, మూడు సంయుక్త కార్యదర్శి పదవులకు 20 మంది నామినేషన్ వేసి, బరిలో నిలిచారు. ఉదయం నుంచి రాత్రి వరకు రెడ్డి సం క్షేమ సంఘం కార్యాలయం వద్ద సందడి కనిపించింది.

ఆదివారం రాత్రి మూడు గంటల వరకు ఎన్నికల లెక్కింపు కొనసాగింది. పల్కల సురేందర్‌రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా మూల ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కూర మహిపాల్‌రెడ్డి, చాడ రవీందర్‌రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పింగిళి రవీందర్‌రెడ్డి, కోశాధికారిగా బారాజు కేశవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా కాసిరెడ్డి రాణిరెడ్డి, దాసరి రాంరెడ్డి, గోగూరి శైలేందర్‌రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా పాకల రాంరెడ్డి, దాన్యకుల శ్రీనివాస్‌రెడ్డి , రెడ్డి సంపత్‌రెడ్డి, మడ నారాయణరెడ్డి, చింతల శ్రీనివాస్‌రెడ్డి, కనకాల సరోజన, కర్ర జయ, పిన్నింటి సంగీత, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో జిల్లా సంఘం అధ్యక్షుడు మూల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి సంఘ భవన అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నూతన సంఘం కార్యవర్గం సభ్యులు రాబోయే రోజుల్లో రెడ్డి సంక్షేమ సంఘం అధ్వర్యంలో బాలికల హాస్ట ల్ ఏర్పాటు చేస్తామనీ, నిరుపేద మహిళా విద్యార్థులు, 200మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు భవనం నిర్మిస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎనుకున్న ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. పలువురు సంఘ సభ్యులు నూతన అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కోశాధికారిని పూలమాల, శాలువాలతో సన్మానించారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles