చేపల ఎగుమతికి బృహత్తర ప్రణాళిక

Mon,October 21, 2019 01:14 AM

మల్యాల: తెలంగాణ రాష్ట్రం నుంచి చేపల ఎగుమతికి టీఆర్‌ఎస్ సర్కారు బృహత్తర ప్రణాళిక రూపొందించిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత ఉద్ఘాటించారు. మాంసపు ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా ముదిరాజ్‌లు, గంగపుత్రులకు చేపలు, గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మల్యాల మండలంలోని పోతారం ఊ ర చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం మాంసపు ఉత్పత్తులకు మంచి డిమాండ్ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల నుంచి గొర్రెలు, చేపలను దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చి ఎగుమతి చేసే స్థాయికి తీసు కువచ్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నారన్నారు. చేప పిల్లల పంపిణీతో మత్స్యకార వృత్తిని ప్రోత్సహించడంతోపాటు సబ్సిడీ రూపంలో ద్విచక్ర వాహనాలతోపాటు ట్రాలీ ఆటోలను సైతం అందజేస్తున్నామన్నారు.

కొండాపూర్ మైసమ్మ చెరువులో..
కొడిమ్యాల: కొండాపూర్ మైసమ్మ చెరువులో 2.60 లక్షల చేపపిల్లలను జడ్పీ చైర్‌పర్సన్ వసంతతో కలిసి ఎమ్మెల్యే రవిశంకర్ వదిలారు. ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో మెట్ట ప్రాంత చెరువులను ఎల్లంపల్లి నీటితో నింపినట్లు చెప్పారు. ముదిరాజ్ కులస్థులకు ఉపాధి కల్పించేందుకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తునట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles