లక్కు.. కిక్కు

Sat,October 19, 2019 02:05 AM

-లాటరీ పద్ధతిలో 84 షాపుల కేటాయింపు
-అభ్యంతరాలతో మూడు నిలిపివేత
-170 మంది మహిళల్లో 11 మందిని వరించిన అదృష్టం
-నవంబర్ ఒకటి నుంచి నూతన పాలసీ
-దరఖాస్తులతో 26.92 కోట్ల ఆదాయం

కరీంనగర్ క్రైం : జిల్లాలోని 87 మద్యం దుకాణాలకు ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని కరీంనగర్ అర్బన్, రూరల్, తిమ్మాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట సర్కిళ్ల పరిధిలో మొత్తం 87 మద్యం దుకాణాలకు 1,346 దరఖాస్తులు రాగా, శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో డ్రా ప్రక్రియ చేపట్టారు. దరఖాస్తుదారులు, వ్యాపారులు, వారి కుటుంబసభ్యులు పెద్దసంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకోగా, టోకెన్లు ఉన్న దరఖాస్తుదారులను మాత్రమే లోపలికి అనుమతించారు. ఉదయం 10.30 గంటలకు జేసీ శ్యాం ప్రసాద్‌లాల్ సమక్షంలో డ్రా ప్రారంభించారు. ముందుగా దరఖాస్తులు తక్కువగా వచ్చిన మద్యం దుకాణాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కరీంనగర్ రూరల్ సర్కిల్‌లోని గెజిట్ నంబర్ 46, తిమ్మాపూర్ సర్కిల్ హాన్మాజీపల్లి గెజిట్ నంబర్ 58, జమ్మికుంట గెజిట్ నంబర్ 78కు సంబంధించి డ్రా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం 84 మద్యం దుకాణాలకు అత్యంత పారదర్శకంగా ప్రక్రియ చేపట్టారు. దరఖాస్తుల దారుల సమక్షంలో జేసీ డ్రా తీశారు. షాపులు దక్కించిన వ్యాపారులకు లైసెన్స్ కార్డులు అందజేశారు.

నవంబర్ 1 నుంచి నూతన మద్యం దుకాణాలు చేతికి రానుండగా, షాపులు దక్కించుకున్న వ్యాపారులు ఆనందంలో మునిగిపోయారు. ఈఎండీ చెల్లింపు లేకపోవడంతో ఎక్సైజ్ పన్ను కింద ఏడాది కాలానికి చెల్లించాల్సిన మొత్తంలో 5 శాతం పన్ను చెల్లించాలని నిర్ణయించగా, 84 దుకాణాలకు గాను 1/4వ వంతు లైసెన్స్ ఫీజును వ్యాపారులు డీడీల రూపంలో ప్రభుత్వ ఖాతాలో జమ చేశారు. ఎక్సైజ్ పన్నుల రూపంలో 12 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. డ్రా నిలిపేసిన మూడు మద్యం దుకాణాలకు ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఇటు 84 వైన్స్‌లకు 170 దరఖాస్తులు సమర్పించిన మహిళల్లో 11 మంది షాపులను దక్కించుకున్నారు. కరీంనగర్ టౌన్ పరిధిలో గెజిట్ నెంబర్ 3, 5, 6, రూరల్ పరిధిలో 30, 41, తిమ్మాపూర్ పరిధిలో 49, 56, హుజురాబాద్ పరిధిలో 59, 66, జమ్మికుంట పరిధిలో 77, 88 వైన్స్‌లను పొందారు.

భారీగా ఆదాయం..
కరీంనగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని చెర్లబూత్కుర్ గెజిట్ నంబర్ 46, తిమ్మాపూర్ సర్కిల్‌లోని హన్మాజీపల్లి గెజిట్ నంబర్ 58, జమ్మికుంట టౌన్ పరిధిలోని గెజిట్ నంబర్ 78లో డ్రాలు నిలిపివేశారు. 65 లక్షల స్లాబులో 44 వైన్స్‌లు.., 55 లక్షల స్లాబులో 31.., 50 లక్షల స్లాబులో 12 షాపులు ఉన్నాయి. రెండేళ్ల కాలానికి గాను లైసెన్స్ ఫీజు రూపేణా 97.30 కోట్లు ప్రభుత్వ ఖజనాకు జమ కానున్నది. ఎక్సైజ్ పన్ను రూపేణా 7 కోట్ల 83 లక్షలు రానున్నది. స్లాబ్ పరిధి దాటిన విక్రయాలపై అదనంగా 14 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు వంద కోట్ల విక్రయాలు జరుగుతుండగా, 24 నెలలకు గాను 2400 కోట్ల విక్రయాలు జరిగే అవకాశమున్నది. స్లాబ్ పరిధికి ఆరు రెట్లు మించి విక్రయాలు జరిపే వాటిపై వ్యాపారులు చెల్లించే అదనపు సొమ్ముతో మరింత ఆదాయం కూడా ప్రభుత్వ ఖాతాకు జమ కానున్నది.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles